Type Here to Get Search Results !

Zone 1 Seniority Lists 2026

 పత్రిక ప్రకటన

పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్, 2025 ప్రకారం పాఠశాల విద్యాశాఖలో జోన్- 1లో గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు (ప్రభుత్వ/ ZPP, MPP/ GVMC/VMC/మున్సిపాలిటీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు), మండల విద్యాశాఖాధికారులు (MEO, MEO-II), డైట్ (DIET) సీనియర్ లెక్చరర్లు మరియు లెక్చరర్ల ముసాయిదా సీనియారిటీ జాబితాలను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, విద్యాశాఖ జోన్-1, విశాఖపట్నం వారి rjdsevsp.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడమైనది.

కావునా సంబందిత అధికారులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క వివరములు మరియు సీనియార్టీ పరిశీలించుకొని, ఏమైనా అభ్యంతరాలు / అప్పీళ్లు ఉన్న ఎడల సంబందిత విద్యాశాఖాధికారి వారికి తగు ఆధారాలతో తేది. 08.11.2026 సాయంత్రం 05.00 గంటల లోగా సమర్పించవలసిందిగా కోరడమైనది. మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, విద్యాశాఖ జోన్-1, విశాఖపట్నం వారి ఈమెయిల్ id (rjdsevsp@apschooledu.in)కి వారి అభ్యంతరాలు / అప్పీళ్లు తగు ఆధారాలతో నిర్ణీత సమయంలో నేరుగా ఈమెయిల్ చేయగలరని తెలియచేయదమైనది. నిర్ణీత సమయంలో సమర్పించని అభ్యంతరాలు/అప్పీళ్లు పరిగణించబడవు మరియు వెబ్ సైట్ లో పొందుపరచిన వివరాల/ సీనియారిటీ ప్రాప్తికి తదుపరి చర్య తీసుకొనుట జరుగునని తెలియచేయదమైంది.

Download All Seniority Lists